రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసే ఫైటో కెమికల్స్ వంటి పోషకాలు ఇందులో సమృద్దిగా ఉంటాయి. పిస్తా తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. జీవక్రియని మెరుగుపరుస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పిస్తాకు న్యూరో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంటుంది. మెదడు పని సామర్థ్యానికి ఇది చాలా బాగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలో యాంటీఆక్సిడెంట్లను పెంచి ఆక్సిడైజ్డ్ LDL తగ్గిస్తుంది. పిస్తా పప్పులో కాల్షియం ఉండటం వల్ల ఎముకలను బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. పిస్తాపప్పులు కీమో నివారణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు సాయపడుతుంది. అనేక రకాల స్వీట్స్ లో పిస్తా పప్పు డెకరేషన్ కోసం గార్నిష్ గా కూడా ఉపయోగిస్తారు. నోటికి చాలా రుచిగా ఉంటాయి.