బరువు తగ్గాలా? డైట్‌లు, కసరత్తులు అక్కర్లేదు - రోజూ ఇలా చేస్తే చాలు! బరువు తగ్గడమంటే రాకెట్ సైన్స్ కాదు. మనం అలవరచుకొనే చిన్న అలవాట్లే మన బరువును నిర్దేశిస్తాయి. బరువు తగ్గేందుకు ఇప్పటివరకు చేస్తున్న డైట్‌లకు, వ్యాయామాలకు గుడ్‌బై చెప్పి ఈ చిట్కాలు పాటించండి. భోజనానికి ముందు నీరు తాగండి. ఇలా చేయడం వల్ల ఆకలి తగ్గి ఎక్కువ ఆహారం తీసుకోలేం. రోజూ ఉదయాన్నే నిమ్మ రసం తీసుకోండి. అది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గిస్తుంది. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారాన్ని సేవించడం వల్ల శరీరంలో క్యాలరీల సంఖ్యను నియంత్రించవచ్చు. బటర్‌కు బదులుగా నెయ్యిని వాడండి. సాధారణ వంటనూనెకు బదులు ఆలివ్ ఆయిల్‌ను ఎంచుకోండి. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయండి. అధ్యయనాల ప్రకారం ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గొచ్చు. ఎప్పుడూ ఆకలితో ఉండకుండ.. క్యాలరీలపై దృష్టి పెట్టండి. సరైన మోతాదులో ఫ్యాట్స్, కార్భోహైడ్రేట్స్ తీసుకోండి.