నారింజ తినటం వలన శరీరానికి కావాల్సిన విటమిన్-C లభిస్తుంది.

దీని నుంచి శరీరానికి కావాల్సిన 'ఫైబర్' లభిస్తుంది.

ఈ పండులోని విటమిన్-C రక్తంలోని ఐరన్ శాతాన్ని పెంచుతుంది. దానివలన రక్తహీనతను అదిగమించొచ్చు.

దీనిలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి.

ఈ పండులో లభించే 'పొటాషియం' గుండె పనిచేయుటకు, కండరాల్ల సంకోచానికి దోహదపడతాయి.

ఈ పండ్ల రసం తాగితే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.

వీటిలో ఉండే విటమిన్-C రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు క్రిములు, బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

ఇందులోని ఫైబర్.. రక్తంలోని కొవ్వు(బ్లడ్ కొలెస్ట్రాల్) తగ్గించడంతో పాటు, పొట్టలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది.

ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది.

నారింజలో - క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్-A, విటమిన్-B కూడా లభిస్తాయి. అవి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

Images Credit: Pixabay and Pexels