బైక్‌పై వెళ్తున్నప్పుడు సడెన్‌గా కుక్కలు వెంటపడుతుంటాయి. ఇలా ఎందుకు చేస్తాయో మనకు అర్థం కాదు. కుక్కలు తమ టెరిటరీలోని వెహికిల్స్‌ని పసిగట్టేస్తాయి. వాటినే గుర్తు పెట్టుకుంటాయి. అవి ఉండే చోటుకు కొత్త వెహికిల్స్ వస్తే అస్సలు ఊరుకోవు. ఆ ఏరియా దాటేంత వరకూ తరుముతూనే ఉంటాయి. కుక్కలకు బోర్ కొట్టినా కూడా ఇలా వెహికిల్స్‌ని చేజ్ చేస్తాయట. ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఇదో రెమెడీ అన్నమాట. వాహనాల నుంచి వచ్చే శబ్దం అంటే కుక్కలకు భయమట. అందుకే ఆ సౌండ్ వినగానే ఇరిటేట్ అయ్యి వెంట పడతాయి. వాహనాల కారణంగా గాయపడినా కొన్ని కుక్కలు ఇలానే వెంట పడతాయి. వెహికిల్స్‌ని శత్రువులా చూస్తాయి. గుండ్రంగా తిరిగే టైర్లను చూసి కుక్కలు అట్రాక్ట్ అవుతాయట. అందుకే వెంట పడతాయి. కుక్కలు తరుముతుంటే వెహికిల్ స్పీడ్‌ని తగ్గించాలి. అలా చేస్తే అవి చేజ్ చేయడం ఆపేస్తాయి. (Image Credits: Pixabay, Postoast)