గుమ్మడి గింజలు తింటే ఎంత అందమో

గుమ్మడి గింజలు రోజుకు గుప్పెడు తింటే చాలు, ఎంతో ఆరోగ్యం, ఎంతో అందం కూడా.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటూ విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. చర్మానికి, జుట్టు ఇది మెరుపునిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి ఇవి సహకరిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి గుండెను రక్షిస్తాయి.

మధుమేహం ఉన్న వాళ్లు గుప్పెడు గింజలు తింటే చాలా మేలు.

గ్యాస్ట్రిక్, రొమ్ము, కొలొరెక్టల్ క్యాన్సర్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి.

రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి.

అమినో ఆమ్లం ట్రిప్టోఫాన్ ఇందులో ఉంటుంది. దీనివల్ల మంచిగా నిద్ర పడుతుంది.

గర్భిణులు వీటిని తినడం వల్ల జింక్ పుష్కలంగా అందుతుంది.