ఎముకలతో కూడిన చికెన్ - వందగ్రాములు దాల్చిన చెక్క - చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బల తురుము - నాలుగు అల్లం తురుము - అర స్పూను ఉల్లిపాయ - ఒకటి క్యారెట్ - అరకప్పు
క్యాప్సికమ్ - అర కప్పు గ్రీన్ బీన్స్ - అరకప్పు లవంగాలు - మూడు ఉప్పు - రుచికి సరిపడా కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు మిరియాల పొడి - అర స్పూను
ముందుగా కుక్కర్లో చికెన్, దాల్చిన చెక్క, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ బీన్స్, లవంగాలు, ఉప్పు వేసి మూడు నాలుగు విజిల్స్ దాకా ఉడికించాలి.
కుక్కర్ మూత తీసి చికెన్ ముక్కలను ఏరి ఓ ప్లేటులో వేసుకోవాలి. ఎముకల చుట్టూ ఉండే మెత్తటి ముక్కలను తీసి పెట్టుకోవాలి. ఎముకలు పడేయాలి.
కుక్కర్లో మిగిలిన మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టి మరిగించాలి.
అందులో వేరు చేసి పెట్టుకున్న మెత్తటి చికెన్ ముక్కలను, మిరియాల పొడి వేసుకోవాలి.
చివర్లో కార్న్ ఫ్లోర్ నీటిలో కలిపి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి.