ప్లేటులో మూడు చపాతీలు వడ్డించకూడదా?

మనదేశం అనేక మత విశ్వాసాలకు నెలవు. ఆ విశ్వాసాలకు ఎంతో విలువ ఇచ్చే ప్రజలు ఇక్కడ ఉన్నారు.

మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటూ కొన్ని దేశాల్లో మూడు సంఖ్యను అశుభంగా భావిస్తారు.

ముఖ్యంగా మూడు చపాతీలు పెట్టడంపై చాలా వాదనలు ఉన్నాయి.

ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని పేరు మీద కర్మ చేస్తారు. దాని ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ప్లేటులో మూడు రోటీలు పెడతారు.

మూడు రోటీలతో కూడిన ప్లేటు మరణించిన వ్యక్తికి చెందినదిగా భావిస్తారు.

అందుకే జీవించి ఉన్న వ్యక్తి ప్లేటులో మూడు రోటీలు వేసుకుని తినకూడదని చెబుతుంటారు పెద్దలు.

ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నమ్మకాలు ఉన్నాయి.

ఎవరికైనా మూడు ఆహార పదార్థాలు ప్లేటు వడ్డిస్తే వడ్డించిన వ్యక్తికి, తిన్న వ్యక్తికి శత్రుత్వ భావాలు పెరుగుతాయని అంటారు.