టేస్టీ కార్న్ దోశ.. రెసిపీ ఇదిగో



పచ్చిమొక్కజొన్న గింజలు - మూడు కప్పులు
మినపప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు
ఎండు మిర్చి - ఒకటి
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూను

మొక్కజొన్న గింజలు, మినపప్పులను ముందే నానబెట్టుకోవాలి.

ఆ పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకులు, ఉప్పు వేసి రుబ్బుకోవాలి.

ఇప్పుడు ఆ రుబ్బును ఒక గిన్నెలోకి తీసుకుని అవసరమైనన్ని నీళ్లు కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి నూనె వేసి వేడెక్కాక దోశెలు వేసుకోవాలి.

ఈ టేస్టీ దోశెలను కొబ్బరి చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది.