బియ్యం - ముప్పావు కప్పు మినపప్పు - అర కప్పు టమోటాలు - మూడు ఎండుమిర్చి - మూడు ధనియాలు - రెండు స్పూనులు నూనె - తగినంత నీళ్లు - రెండు కప్పులు ఉప్పు - రుచికి సరిపడా
బియ్యం, మినపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి.
ఉదయం బియ్యం, మినపప్పు, ధనియాలు వేసి మెత్తగా దోశెపిండిలా రుబ్బుకోవాలి.
ఎండు మిర్చి, టమాటోలు కూడా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
దోశెపిండిలో టమోటా,ఎండు మిర్చి ప్యూరీని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.
ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఓ అరగంట పాటూ పక్కన వదిలేయాలి.