బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. అధిక కార్బ్ ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని తీసుకుంటే ఇన్సులిన్ 34 శాతం పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.



వెనిగర్ ని వేడి నీళ్ళలో కలుపుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతులో బ్యాక్టీరియాని చంపేస్తుంది.



ఫేషియల్ టోనర్ గా ఉపయోగిస్తే వృద్ధాప్య సంకేతాలు దూరం చేస్తుంది.



ఇందులోని యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ వైరల్ లక్షణాలు హానికరమైన నోటి బ్యాక్టీరియాని చంపి నోటి దుర్వాసన పోగొడుతుంది.



చుండ్రు సమస్యని నివారిస్తుంది. చుండ్రు వచ్చేలా చేసే మలాసేజియా అనే ఫంగస్ పెరుగుదలని అడ్డుకుంటుంది.



మొటిమల మీద ఈ వెనిగర్ అప్లై చేయడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి.



డియోడ్రెంట్ గా కూడా ఇది పని చేస్తుంది. దుర్వాసన పోగొడుతుంది.



సలాడ్ డ్రెస్సింగ్ గా ఇది పదార్థాలకి అదనపు రుచి జోడిస్తుంది.



సరైన పద్ధతిలో యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. బొడ్డు దగ్గర కొవ్వుని కరిగించేస్తుంది.