చేపలు రోజూ తింటే ఎన్ని లాభాలో చేపల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉన్నాయి. ప్రొటీన్లు, విటమిన్ డి పుష్కలంగా దొరుకుతాయి. వారానికోసారి చేపలు తిన్నా చాలు గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కళ్లు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికం. గర్భిణిలకు, బాలింతలకు చేపలు తినడం చాలా అవసరం. చేపలు తినేవారిలో మానసిక సమస్యలు రావు. చేపలు రోజూ తినేవారిలో మెదడులోని ‘గ్రే మ్యాటర్’ అధికంగా ఉంటుంది. ఇదే భావోద్వేగాలను, మెమోరీని నియంత్రిస్తుంది. పిల్లలకు చేపలు పెడితే మంచిది. ఆస్తమా వచ్చే ఛాన్సు తగ్గుతుంది. చేపలు తినేవారిలో టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది.