ఈ పనులు చేస్తే రక్తంలో షుగర్ పెరిగిపోతుంది మధుమేహం కొందరిలో వారసత్వంగా వస్తుంది కానీ మరికొందరిలో మాత్రం వారి చెడు జీవనశైలి కారణంగా వస్తుంది. మీ రోజువారీ కార్యకలాపాలు కొన్ని డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. తీవ్రమైన ఎండల్లో ఎక్కువ సేపు ఉండడం కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాఫీలో అధికంగా కాఫీ పొడి, చక్కెర వేసుకుని తాగకూడదు.ఆ రెండు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. నిద్ర సరిపోకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగేస్తాయి. చిగుళ్ల వ్యాధి ఉన్న వారిలో కూడా షుగర్ వ్యాధి పెరుగుతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోయినా సమస్య పెరిగిపోతుంది. కృత్రిమ స్వీటెనర్లను దూరంగా పెట్టాలి. మధుమేహం ఉన్నవారికి ఇవి ఉత్తమమైనవి కావు.