నారింజ కంటే జామలోనే అధికంగా విటమిన్ సి లభిస్తుంది. జామపండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జామకాయలో 80 శాతం నీరే ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. దంతసమస్యలు రాకుండా నివారిస్తుంది. గర్భిణులకు మేలు చేసే పండు. ఇందులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి అద్భుతమైన పండు. ఫైబర్, ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. జామపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. జామపండ్లలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒత్తిడిని అధగమించడానికి గొప్ప మార్గం. జామపండులో అనేక మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. జామకాయ తినడం లేదా జ్యూస్‌గా చేసుకుని తాగిన ఆరోగ్యానికి మంచిదే.