మగవారు ఈ స్వీట్ తినడం ఎంతో అవసరం స్పెర్మ్ కౌంట్ తక్కువవడం అనేది మగవారిలో అధికంగా వెలుగుచూస్తున్న సమస్య. దీనివల్ల పిల్లలు కలగక ఎంతో మంది మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. సాంప్రదాయక బద్దమైన ఓ ఇండియన్ స్వీట్ ఆ సమస్యలకు చెక్ పెడుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు. ఈ మిఠాయి పేరు ‘గుల్కండ్’. దీన్ని తమలపాకులో ఒక స్పూను వేసుకుని తినడం వల్ల చాలా మంచిది అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. గుల్కండ్ ఒకసారి తయారుచేసుకుంటే ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది. గుల్కండ్ తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఇది సహజ శీతలకారిణి. కళ్లు తిరగడం, ముక్కులోంచి రక్తం రావడం, వడదెబ్బ వంటి వాటి నుంచి ఇది కాపాడుతుంది.