ఇలా కొబ్బరినీళ్లు తాగితే బరువు తగ్గిపోతారు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ఎక్కువ మంది చేసే పని కొబ్బరి నీళ్లు తాగడం. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. కొబ్బరినీరు శరీరానికి హైడ్రేషన్‌ను అందిస్తుంది. అలాగే కొవ్వును కరిగించడంలో కూడా మీకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు ఎన్ని తాగినా బరువు పెరగరు. ఇందులో ఉండే కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. కొబ్బరినీళ్లు రోజూ పరగడుపున తాగితే త్వరగా బరువు తగ్గుతారు. కొబ్బరి నీళ్లలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.జంక్ ఫుడ్ లాంటివి తినాలన్న కోరికను చంపేస్తుంది. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోనివ్వవు కొబ్బరినీళ్లు. కాబట్టి సహజంగానే బరువు తగ్గుతారు.