సింపుల్‌గా సోయా కబాబ్స్



సోయా గింజలు - రెండు కప్పులు
బంగాళాదుంపలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పచ్చిబఠాణీలు - అరకప్పు
శనగపిండి -రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా



ధనియాల పొడి - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
గరం మసాలా - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
నూనె - వేయించడానికి సరిపడా

సోయా గింజలను గంట పాటూ నానబెట్టి, తరువాత వాటిని ఉడకబెట్టుకోవాలి.

అలాగే బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలను ఉడకబెట్టుకోవాలి.

ఒక గిన్నెలో ఉడకబెట్టిన సోయా గింజలు, బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలు వేసి బాగా చేత్తోనే మెదపాలి.

అందులో కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, శెనగపిండి, ఉప్పు, ఉల్లితరుగు వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని కబాబ్స్‌లా ఒత్తుకుని పుల్లలకు గుచ్చి కాల్చుకోవాలి.

అంటే టేస్టీ సోయా కబాబ్స్ రెడీ అయినట్టే.