కీటో డైట్ కంటే అడపాదడపా ఉపవాసం చేయడం మంచిదని చాలా మంది నమ్ముతారు.

కానీ ఉపవాసం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

అడపాదడపా ఉపవాసం ఉండే వాళ్ళు ఆకలికి అసలు తట్టుకోలేరు. ఎక్కువ సేపు ఆకలితో ఉండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం చూడగానే తినాలని ఆశపడిపోతారు.

తినకపోవడం వల్ల బలహీనతగా అనిపిస్తారు. శక్తి ఉండకపోవడంతో నీరసంగా కనిపిస్తారు.

మూత్రం ద్వారా శరీరం చాలా ఉప్పు, నీటిని కోల్పోతుంది. దీని ఫలితంగా డీహైడ్రేషన్ కి గురవుతారు.

తక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి.

చికాకు, మూడ్ మారడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో తేడా వచ్చేస్తుంది.

ఒక్కసారిగా ఆకలి అణుచుకుని ఉండటం వల్ల కళ్ళు తిరగడం, మైకం రావడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.

Image Source: Pexels

డయాబెటిక్ రోగులు ఉపవాసం చేయకపోవడమే మంచిది. మధుమేహం ఉన్న వాళ్ళు ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉండకూడదు. అది ప్రమాదకరం.