సీఫుడ్ అలెర్జీ లక్షణాలు ఇవే చికెన్, మటన్‌తో పోలిస్తే చేపలు, రొయ్యలు, పీతలు చాలా ఆరోగ్యకరమైనవి. కానీ కొందరికి పడవు. తమకు పడతాయో పడవో తెలియక కొంతమంది వాటిని తిని తరువాత ఆరోగ్యసమస్యలు తెచ్చుకుంటారు. సీఫుడ్ అలెర్జీ లక్షణాలు ఎలా ఉంటాయంటే... శరీరంపై దద్దుర్లు వచ్చి దురద పెడుతుంది. పెదవులు, ముఖం, నాలుక, గొంతుపై వాపు వస్తుంది. శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. దగ్గు రావడం, ఉక్కిరిబిక్కిరి కావడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే సీఫుడ్ తినడం మానేయాలి.