పుదీనా శ్లేష్మాన్ని పలుచన చేసి గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగించేలా చేస్తుంది. మెంతులు గొంతు నొప్పికి సహజ నివారణ. టీలో వీటిని వేసుకుని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చమోమిలీ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండటం వల్ల జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది/ ఉప్పు నీళ్ళు తాగడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఉప్పు నీళ్ళు పుక్కిలించడం వల్ల గొంతు శుభ్రం చేసి ఉపశమనం కలిగేలా చేస్తుంది. దగ్గు, గొంతు నొప్పి తగ్గించడంలో తేనె ప్రభావవంతంగా పని చేస్తుంది. టీలో కలుపుకుని తాగితే చక్కటి ఫలితం పొందుతారు. యాపిల్ సిడర్ వెనిగర్ తో గొంతులో దురద, నొప్పి తగ్గుతుంది. టీ స్పూన్ వెనిగర్ ని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగొచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన అనే గుణం జలుబు, గొంతు నొప్పితో పోరాడుతుంది. వేడి నీటిలో పసుపు వేసుకుని ఆవిరి పడితే చాలా రిలీఫ్ వస్తుంది. హెర్బల్ టీ తాగడం వల్ల గొంతు మృదువుగా మారుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది.