బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే వచ్చే రోగాలివే

బ్రేక్‌ఫాస్ట్ తరచూ స్కిప్ చేస్తున్నారా? అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు మీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి.

బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతాం అనుకుంటారు కానీ, తెలియకుండానే బరువు పెరిగిపోతారు.

బ్రేక్ ఫాస్ట్ తినకుండా నేరుగా లంచ్ తినడం వల్ల ఎక్కువ తినేసే అవకాశం ఉంది. అది కొవ్వు రూపంలో ఓ మూల పేరుకుపోతుంది.

అధ్యయనాల ప్రకారం ఎవరైతే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారో వారిలో ధమనుల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఎక్కువ.

అల్పాహారం తినడం మానేస్తే ఇన్సులిన్ నిరోధకత వల్ల ఏర్పడే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఆకలితో అలమటిస్తారు. దీని వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక పెరుగుతుంది.

ఉదయానే అల్పాహారం తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తితో పాటూ, పోషకాలు అందుతాయి. రోజంతా చురుగ్గా ఉంటారు.