పంచదారకు బదులు బెల్లం వాడితే ఎంత మంచిదో

పంచదారను ఎంత ఎక్కువగా వాడితే అంతగా మీరు అనారోగ్యాలకు దగ్గరవుతున్నట్టే.

అందుకే పంచదారకు బదులు బెల్లం వాడాలని సూచిస్తున్నారు వైద్యులు.

పంచదార వాడితే దీర్ఘకాలంలో అనేక రోగాల బారిన పడే అవకాశం ఎక్కువ.

చక్కెర వాడుకతో హైబీపీ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి.

ఇక శరీరంలో కొవ్వు పెరిగిపోయి, అధికబరువుతో డయాబెటిస్ వ్యాధి వస్తుంది.

బెల్లాన్ని వాడడం వల్ల శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటివి లభిస్తాయి.

బెల్లం తినడం వల్ల వచ్చే కేలరీలు కూడా సున్నా.

బెల్లాన్ని తింటే శరీరంలో ఉష్ణోగ్రత పుడుతుంది. కాబట్టి చలికాలంలో బెల్లం తినడం వల్ల చలి తక్కువగా వేస్తుంది.