సమంతకున్న వ్యాధి ప్రమాదకరమా?

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత తనకున్న అరుదైన వ్యాధి మైయోసిటిస్ గురించి బయటపెట్టింది.

ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే శరీరంలోని రోగనిరోధక శక్తి స్వయంగా శరీరంపైనే దాడి చేస్తుంది.

ఈ వ్యాధి వచ్చిన వారిలో కండరాలు చాలా బలహీనంగా మారిపోతాయి. త్వరగా అలిసిపోతాయి. నొప్పులు పుడతాయి.

కండరాల దగ్గర మొదలైన నొప్పి చర్మం, ఊపిరితిత్తులు, గుండె వంటి ఇతర శరీరభాగాలకు చేరుతుంది.

కళ్ల చుట్టు ఉబ్బడం లేదా రంగు మారడం కూడా మైయోసిటిస్ లక్షణాలలో ఒకటి.

రోజువారీ పనులు కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి. కనీసం జుట్టు దువ్వుకోవడం కూడా చేయలేరు.

కొన్ని సార్లు స్టెరాయిడ్లు ఇచ్చి ఈ వ్యాధి నుంచి బయటపడేలా చేస్తారు.

ఫిజియో థెరపీ, ఆక్యూపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ వంటివి ఇస్తారు.