పచ్చిమిర్చి పులావ్ తింటే అదిరిపోతుంది



బాస్మతి బియ్యం - ముప్పావు కిలో
పచ్చిమిర్చి - ఎనిమిది
ఉల్లిపాయలు - రెండు
కొత్తిమీర తరుగు - అరకప్పు
పుదీనా తరుగు - అరకప్పు



అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు
గరం మసాలా పొడి - అర స్పూను
నూనె - అవసరమైనంత
యాలకులు - రెండు
లవంగాలు - అయిదు



దాల్చిన చెక్క - చిన్న ముక్క
పసుపు - చిటికెడు
ధనియాల పొడి - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
గ్రీన్ పీస్ - అర కప్పు
క్యారెట్ ముక్కలు - పావు కప్పు

పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేయాలి. క్యారెట్, పచ్చిబఠాణీలను, ఉల్లిపాయలు వేసి వేయించాలి.

అందులో రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి.

ఆ మిశ్రమంలో బియ్యం, నీళ్లు వేసి కలుపుకోవాలి.

అన్నం ఉడికాక స్టవ్ కట్టేయాలి. అంతే పచ్చిమిర్చి పులామ్ రెడీ అయినట్టే.