కాలే ఆకుపచ్చ కూర. విటమిన్ సి, కె వంటి పోషకాలు మెండు. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బ్రకోలిలో ఫైబర్, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. బెర్రీలు అత్యంత పోషకాలు నిండిన పదార్థాలు. ఫైబర్, విటమిన్ సి, కెతో నిండి ఉంటాయి. తీపి రుచి మాత్రమే కాదు కేలరీలు తక్కువ అందిస్తుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడంలో టమోటాలు ఉత్తమం. నీరు ఎక్కువ కేలరీలు తక్కువ. వెయిట్ లాస్ కోసం సహాయపడే అత్యుత్తమ సూపర్ ఫుడ్. విటమిన్ బి 12, రిబోఫ్లోవిన్, ఖనిజాలు, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ పోషకాలతో నిండి ఉన్నాయి. జీర్ణక్రియలో సహాయపడతాయి. బెల్ పెప్పర్స్ వివిధ రంగుల్లో లభిస్తాయి. నీటి కంటెంట్ ఎక్కువ, కేలరీలు తక్కువ. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ ఇ, ఫోలేట్ ఉంటాయి. ఆకలిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తృణధాన్యాల్లో ఓట్స్ చాలా మంచిది. మాంగనీస్, రాగి, ప్రోటీన్లతో నిండిన ఉత్తమ ఫైబర్ మూలం. ఆకలిని నియంత్రిస్తాయి.