ఏ సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు ఆ సీజన్ లో తీసుకోవాలి. ఇవి ఇమ్యూనిటి పెంచడంలో బాగా ఉపయోగపడతాయి ప్రతి రోజు తప్పకుండా మెడిటేషన్ సాధన చెయ్యడం వల్ల రిలాక్స్ డ్ ఫీల్ ఉంటుంది. ఇది శరీరానికి సీజన్ మారినపుడు జరిగే మార్పులను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. చల్లన నిమ్మ రసం వంటి వాటిని ఈకాలంలో కాస్త పక్కన పెట్టాలి వేడిగా గ్రీన్ టీ, వెచ్చని పాలు, హెల్దీ సూపులు తీసుకోవడం మంచిది. సీజన్ ఏదైనా వ్యాయామం తప్పనిసరి ఎండ తీవ్రత పెద్దగా ఉండని ఈ రోజుల్లో ఎక్కువ ఎండలో సమయం గడపడం మంచిది. సూర్యరశ్మి ని మించిన ఔషధం లేదు శీతాకాలం చర్మ సంరక్షణ తప్పని సరి తగినంత నీళ్లు తాగడం, మాయిశ్చరైజర్లు తరచుగా వాడడం అవసరం రాత్రి పూట తగినంత నిద్ర తప్పనిసరి