Image Source: Pexels

మధుమేహులకి బీన్స్, చిక్కుళ్ళు అద్భుతమైన ఎంపికలు. రక్తంలో చక్కెర స్థాయిలని సమతుల్యం చేసే పోషకాలు అందిస్తుంది.

ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గుండె, బ్లడ్ షుగర్ నియంత్రణకి ఉపయోగపడతాయి. ఇవి తింటే పొట్ట నిండుగా ఉంటుంది. `

పెరుగులో ప్రోబయాటిక్స్ ఉన్నాయి. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

క్వినోవా కొద్దిగా వగరు రుచి కలిగినప్పటికి త్వరగా ఉడికే తృణధాన్యం ఇది. మధుమేహులకి మంచి ఆహారం.

డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధికంగా ఫైబర్ లభించే పండ్లు ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

చిలగడదుంపలో చాలా పోషకాలు ఉన్నాయి. నెమ్మదిగా జీర్ణం అవుతాయి. మధుమేహం ఉన్న వారికి చాలా అద్భుతమైన పదార్థం.

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మెరుగైన ఎంపిక. దాని కెర్నల్ లో ఫైబర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

పాలు, చీజ్ వంటి డైరీ ఉత్పత్తులు తక్కుగా కార్బోహైడ్రేట్ కంటెంట్ లో ఉన్నప్పటికీ పోషకాలు అధికం.

Image Source: Pexels/ Pixabay

పప్పులు, బీన్స్ లో ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణకి అవసరమైన పొటాషియం అందిస్తుంది.