చలికాలాన్ని తట్టుకోవాలంటే బెల్లం తినాల్సిందే

శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో బెల్లం ఒకటి.

బెల్లం చిన్న ముక్క తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా చలివేయదు.

జీర్ణక్రియ మందగించకుండా అడ్డుకుంటుంది.

చల్లని వాతావరణంలో మలబద్ధకం ఎక్కువవుతుంది. బెల్లం తింటే ఆ సమస్య తీరిపోతుంది.

అధిక రక్తపోటు పెరగకుండా అడ్డుకుంటుంది.

మహిళలు బెల్లం తినడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.

చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రోజుకు చిన్న ముక్క తినడం వల్ల శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పొట్ట, ఆహార వాహిక అన్నింటినీ శుభ్రపరుస్తుంది.