ప్రాసెస్ చేసిన ఆహారాలకి దూరంగా ఉండాలి. సోడియం, రసాయనాలు, అదనపు కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. పోషకాలు నిండిన డ్రై ఫ్రూట్స్, పెరుగు, గింజలు క్యారెట్లు వంటివి డైట్లో భాగం చేసుకోవాలి. ఇవి ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. తెల్ల చక్కెర వద్దు. గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే హానికరమైన పదార్థాల్లో చక్కెర ఒకటి. అడపాదడపా ఉపవాసం మంచిది. ఆహార చక్రాన్ని సమతుల్యం చేసే చక్కని విధానం. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి pH సమతుల్యతను కాపాడుతుంది. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తాజా కూరగాయలు, సీజనల్ వారీగా వచ్చే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అధిక పోషకాలు నిండిన ఆహారం ఇది. అతిగా తినడం నివారించాలి. రోజంతా నిండుగా ఉండే ఆహారం ఎంచుకుని తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. వేగంగా తినడం వల్ల ఎక్కువ ఆహారం తినేస్తారు. అది బరువు పెరిగేలా చేస్తుంది. ప్రోబయోటిక్స్ జీర్ణ ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.