బౌద్ద డైట్‌తో సంపూర్ణ ఆరోగ్యం ఎన్నిరకాల డైట్లు పాటించినా పూర్తి ఆరోగ్యం సిద్ధించదు. ఒకసారి బౌద్ధ డైట్‌ను ఫాలో అయి చూస్తే మీకు ఎంతో తేడా కనిపిస్తుంది. బౌద్ధ డైట్ ప్రకారం ఉపవాసం చాలా ఆరోగ్యకరం. ఈ ఉపవాసంలో కొంత సమయం పాటూ ఏ ఆహారాన్నీ తినకుండా ఉండాలి. బౌద్ధ డైట్లో ఎప్పుడూ కూడా మద్యానికి చోటు లేదు. అది పూర్తిగా నిషేధించారు. మద్యమే కాదు లైంగిక కోరికలను, కోపాన్ని పెంచే ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వంటివి కూడా తినరు. ఆహారాన్ని రహస్యంగా దాచుకుని తినడం బౌద్ధ ఆహార పద్ధతులకు విరుద్ధం. అలా తినడం వల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. తినేటప్పుడు ఇతర ఏపనీ చేయకుండా, మాట్లాడకుండా నిశ్శబ్ధంగా తినాలి. అధిక కారం ఉన్న పదార్థాలను, మసాలా పదార్థాలను దూరం పెట్టాలి. కూరగాయలతో వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు, పెరుగు తీసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. బౌద్ధ ఆహారపద్దతులను పాటించడం వల్ల కొన్ని రోజులకే మీకు మార్పు కనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. కోపం తగ్గుతుంది.