సంక్రాంతి స్పెషల్ వంటకం పాకుండలు రెసిపీ



తడి బియ్యప్పిండి - రెండు కప్పులు
కొబ్బరి తురుము - అయిదు స్పూన్లు
తురిమిని బెల్లం - ఒక కప్పు
నెయ్యి - ఒక స్పూను
యాలకుల పొడి - అర స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పాకుండల తయారీకి కచ్చితంగా తడి బియ్యప్పిండినే వాడాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం తురుము వేసి కాస్త నీళ్లు పోసి పాకం తీయాలి.

పాకం వచ్చాక తడి బియ్యంపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.

అందులో కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి.

మిశ్రమం దగ్గరగా గట్టిగా అయ్యాక స్టవ్ కట్టేసి, ఆ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి.

స్టవ్ పై మరో కళాయి పెట్టుకుని అందులో నూనె వేయాలి.

ఆ నూనెలో చుట్టుకున్న ఉండలను డీప్‌గా వేయించాలి. బంగారు రంగు వచ్చాక తీసేయాలి. అంతే పాకుండలు రెడీ.