కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. డార్క్ సర్కిల్స్ మీద ఈ నూనెతో మర్దన చేస్తే తగ్గిపోతాయి. బంగాళాదుంప బ్లీచింగ్ లక్షణాలతో నిండి ఉంది. డార్క్ సర్కిల్స్ పోగేట్టేందుకు సహకరిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచి ప్రకాశవంతమైన చర్మం ఇస్తుంది. నల్లటి వలయాలు తొలగించి మెరిసే ఛాయని పొందేందుకు బాదం నూనె గొప్ప ఔషధం. పచ్చిపాలు కంటి చుట్టూ నల్లటి వలయాలు తగ్గించే సహజ నివారణ. టొమాటో రసం,నిమ్మరసం కలిపి అప్లై చేసుకుంటే నల్లటి వలయాలు తగ్గిపోతాయి. రోజ్ వాటర్ లో దూది ముంచి ప్రతి రోజు రాత్రి కళ్ళ మీద ఉంచితే మంచి ఫలితం పొందుతారు. రెండు కాటన్ ప్యాడ్ లని చల్లటి పచ్చి పాలలో ముంచి వారానికి రెండు సార్లు 10 నిమిషాల పాటు కళ్ళపై ఉంచితే ఫలితం కనిపిస్తుంది. డార్క్ సర్కిల్స్ పోగొట్టుకునేందుకు గ్రీన్ టీ ప్రభావవంతమైన నివారణ. చల్లబడిన గ్రీన్ టీ బ్యాగ్ కళ్ళ మీద 15 నిమిషాల పాటు ఉంచడం మంచిది.