టేబుల్ సాల్ట్ లో ఎక్కువ మొత్తంలో సోడియం శాతం ఉంటుంది. దీన్ని అధికమొత్తంలో తీసుకుంటే బ్లడ్ ప్రజర్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది మనం ప్రతిరోజూ 2300 మిల్లీగ్రాముల సోడియాన్ని మాత్రమే తీసుకోవాలి. అందుకని టేబుల్ సాల్ట్ కు బదులుగా వేరే ఉప్పును వాడి దానివల్ల కలిగే ఇబ్బందులను తొలగించుకోవచ్చు నల్ల ఉప్పులో టేబుల్ సాల్ట్ లో కన్నా తక్కువ సోడియం ఉండడం వల్ల ఇది హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుంది. ఇక హిమాలయా పింక్ సాల్ట్ లో 84 రకాలైన ఖనిజలవణాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో తీసుకుంటే శరీరంలో పీఎహచ్ లెవల్స్ సక్రమంగా ఉంటాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది, వృద్దాప్యం త్వరగా రాకుండా చేస్తుంది. రాక్ సాల్ట్ అనేది టేబుల్ సాల్ట్ కి మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇది మెటబాలిజం ను పెంచి, బ్లెడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. అదేవిధంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇక సముద్రపు ఉప్పు డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచి చర్మవ్యాధులను తగ్గిస్తుంది.