గదుల లోపలకి గాలి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే ఇంట్లో ఉండే చెడు వాసన బయటకి పోతుంది. ఇంటి లోపల చెప్పుల స్టాండ్ అసలు పెట్టుకోవద్దు. ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదం ఉంది. సాల్ట్ క్రిస్టల్ లాంప్ ఇంట్లో పెట్టుకుంటే గాలిని శుద్ధి చేస్తాయి. గాలిలో వ్యాధికారక క్రిముల వ్యాప్తిని నిరోధిస్తుంది. బొగ్గు లైట్ గా మండుతూ ఉంటే చెడు వాసనలు తగ్గిస్తుంది. తేమని తగ్గించి ఇంట్లో తాజాదనం అందిస్తుంది. ఇంట్లో మొక్కలు ఉంచుకోవడం వల్ల కార్బన్ డయాక్సైడ్ అవి పీల్చుకుని మనకి స్వచ్చమైన గాలి అందిస్తాయి. కలబంద వంటి మొక్కలు పెట్టుకుంటే మంచిది. పుదీనా,యూకలిప్టస్ నూనెలు గదిలో ఉండటం వల్ల ఆహ్లాదకరమైన సహజ వాసన ఇస్తాయి. మనసుకి ప్రశాంతత ఇస్తాయి. ఇంట్లో గాలి తాజాగా ఉండాలంటే ప్లాస్టిక్ లేదా రసాయనాలతో నిండిన ఉత్పత్తుల వినియోగం మానుకోవాలి. గదుల్లో గాలి నాణ్యత కాపాడుకోవాలంటే AC లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పెంపుడు జంతువు శుభ్రంగా ఉంచుకోవాలి. అవి మురికిగా ఉంటే సూక్ష్మక్రిములు ఇంట్లోకి ఆహ్వానించినట్టే.