కాలుష్యంతో మగవారిలో సంతాన సమస్యలు అధిక కాలుష్యం వల్ల ఊపిరందక ఇబ్బంది పడడం సహజం. శ్వాస కోశ సమస్యలు, కంటి సమస్యలు, గుండెపై ప్రభావం చూపిస్తుందని చాలా మందికి తెలుసు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల వీర్య కణాలు క్షీణిస్తాయి.వీర్యకణాల సంఖ్య కూడా తగ్గిపోతాయి. వీర్యకణాలు తక్కువగా ఉండడం, వాటిలో చలనం తక్కువగా ఉండడం వల్ల ఆ కణాలు ఫెలోపియన్ ట్యూబ్ (స్త్రీలలో ఉండే అవయవం) లోకి చేరుకోలేవు. కాలుష్యం వల్ల పురుషుల్లో లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోతుంది. దీని వల్ల తరచూ సెక్స్ లో పాల్గొనరు. మనం పీల్చే గాలిలో రాగి, జింక్, సీసం కలిసిన నలుసులాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి పీల్చడం వల్ల టెస్టోస్టెరాన్, స్పెర్మ్ కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే కాలుష్యం బారిన పడకుండా ఉండాల్సిన అవసరం మగవారికి ఉంది.