పిల్లల కోసం మిక్స్‌డ్ వెజిటబుల్ ఇడ్లీ




ఇడ్లీ పిండి - ఒక కప్పు
క్యారెట్ తురుము - అరకప్పు
క్యాప్సికం తురుము- అరకప్పు
ఉడకబెట్టిన పెసరపప్పు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా


ఇడ్లీ పిండిని ముందుగా ఎలా సిద్ధం చేసుకుంటారో అలాగే చేసుకోవాలి.



ఇడ్లీ పెట్టడానికి ముందు ఆ పిండిలో క్యారెట్ తురుము, క్యాప్సికం తురుము, ఉడకబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి బాగా కలపాలి.



ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా, నెయ్యి రాసి రుబ్బు వేసుకోవాలి.



ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే సరి, మిక్స్‌డ్ వెజిటబుల్ ఇడ్లీ రెడీ అయినట్టే.



కొబ్బరి చట్నీతో లేదా టమాటా చట్నీతో ఈ ఇడ్లీ తింటే అదిరిపోతుంది.



ఈ ఇడ్లీని తరచూ పెట్టడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. పోషకాహార లోపం తలెత్తదు.