నిల్వ ఉండేలా కోడిగుడ్డు పచ్చడి



కోడిగుడ్లు - ఎనిమిది
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ఆవ నూనె - ఆరు టీస్పూన్లు
గరం మసాలా - నాలుగు టీస్పూన్లు
కారం - రెండు టీస్పూన్లు



జీలకర్ర - రెండు టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
మెంతి పొడి - రెండు స్పూన్లు
ఆవ పొడి - రెండు స్పూన్లు
కరివేపాకులు - మూడు రెమ్మలు
నిమ్మకాయ రసం - రెండు స్పూన్లు

కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి, కళాయిలో వేయించాలి.

అదే కళాయిలో మరికొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.

అందులోనే కారం, గరం మసాలా, ఉప్పు వేసి వేయించాలి.

అన్నీ వేగాక కరివేపాకులు వేయాలి. స్టవ్ కట్టేయాలి.

గుడ్ల మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు ఆవపొడి, మెంతి పొడి వేసి కలపాలి.

చివర్లో నిమ్మరసం పిండి కలపాలి. దీన్ని ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెల రోజుల వరకు తినవచ్చు.