కలబందతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం పండగ వేళ మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. కలబందలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం మొదలుపెట్టి చల్లని నీటితో ముగించాలి. నిద్ర వల్ల అందం పొందవచ్చు. కంటి నిండా నిద్రపోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ని రిపేర్ చేసి కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది. చర్మానికి ఆరోగ్యకరమైన, యవ్వన రూపాన్ని అందిస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవాలి. అందుకోసం యోగా, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేస్తే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎక్స్ ఫోలియేషన్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఆరోగ్యకరమైన కొత్త చర్మ కణాలు బహిర్గతమవుతాయి. ఇలా చేస్తే ప్రకాశవంతమైన రంగు కూడా వస్తారు. గ్రీన్ టీ చర్మానికి మేలు చేస్తుంది. పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం వల్ల దాని ప్రభావం చర్మంపై పడుతుంది. విటమిన్ సి ఉన్న సీరమ్స్ చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి.