మిక్స్‌డ్ వెజిటబుల్ పూరీ... ఎంతో రుచి




గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
పాలకూర తరుగు - అర కప్పు
క్యారెట్ తరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
నీళ్లు - సరిపడా


పాలకూర, క్యారెట్‌ను సన్నగా తరిగి కళాయిలో కాస్త నూనె వేసి మగ్గించాలి.



ఒక గిన్నెలో గోధుమపిండి, నీళ్లు, ఉప్పు వేసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి.



ఆ పూరీ పిండిలో బాగా మగ్గించిన పాలకూర, క్యారెట్ కలిపి బాగా కలపాలి.



ఇప్పుడు ఆ పిండిని పూరీల్లా ఒత్తుకుని నూనెలో వేయించాలి.



అంతే పోషకాల పూరీ రెడీ అయినట్టే.



కూరలు తినని పిల్లలకు ఇలాంటి టిఫిన్లు పెట్టడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.