స్పెషల్ టీకి కావాల్సిన పదార్థాలు
2 కప్పుల నీళ్ళు
1 అంగుళం అల్లం ముక్క
కొన్ని తులసి ఆకులు
ఒక టీ స్పూన్ వామ్ము
½ టీ స్పూన్ చామంతి(చమోమిలి) పూలు
కొన్ని పిప్పరమెంటు ఆకులు
కొద్దిగా తేనె



స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు అల్లం, తులసి ఆకులు వేసి మరిగించాలి.



తర్వాత వామ్ము, చామంతితో పాటు పిప్పరమెంటు ఆకులు జోడించాలి. ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుని కప్పులోకి తీసుకోవాలి.



ఇందులో కొద్దిగా తేనె కలిపి తాగొచ్చు.



మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు పొట్ట ఉబ్బరం సమస్యని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.



చామంతి పూలు వేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.



అల్లం, చమోమిలి రెండూ నాడీ వ్యవస్థని సడలించి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉన్న ఔషధ గుణాలు తలనొప్పిని తగ్గిస్తాయి.



చర్మానికి మేలు చేస్తుంది.



కాలానుగుణంగా వచ్చే అలర్జీలని కూడా నయం చేస్తాయి.