అనారోగ్యంగా అనిపించినప్పుడు ఏది తినాలని, తాగాలని అనిపించదు. కానీ సరైన ఆహారం తీసుకున్నప్పుడే ఆ అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు.



మనం తీసుకునే ఆహారం అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.



అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌తో, ప‌ప్పుతో చేసిన కిచిడీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది త్వరగా జీర్ణం అయ్యే ఆహారం.



చికెన్ సూప్ లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జలుబు లేదా ఫ్లూ తో బాధపడుతుంటే వేడి వేడి సూప్ తాగితే రిలీఫ్ వస్తుంది.



వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయం చేస్తుంది.



జ్వరం వచ్చినప్పుడు ఆహారం నోటికి సహించదు, కానీ తినడం సరైన ఆహార పదార్థాలు తినడం వల్ల రోగంతో పోరాడే శక్తి లభిస్తుంది.



కొబ్బ‌రినీళ్ల‌లో ర‌క‌ర‌కాల న్యూట్రిషియ‌న్లు ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడి, శ‌రీరాన్ని కూల్ చేసి, జ్వ‌రం త‌గ్గేలా చేస్తాయి.



విట‌మిన్-C ఉన్న పండ్లు అంటే బ‌త్తాయి, నారింజ‌, ద్రాక్ష‌, యాపిల్, కివి, దానిమ్మ ఇలాంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల జ్వ‌రం తొంద‌ర‌గా త‌గ్గిపోతుంది.



వికారంగా అనిపించినప్పుడు అల్లం టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.



ఆకుకూర‌ల్లో ఫైబ‌ర్, వివిధ ర‌కాల న్యూట్రిషియ‌న్స్ అధికంగా ఉంటాయి. ఇవి జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు తింటే వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించి జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గేలా చేస్తాయి.