చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఉదయం లేవగానే వేడి నీళ్ళు తాగడం వల్ల సహజంగా చలిని తట్టుకోవచ్చు. ఉదయాన్నే నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వేడి నీటిని తాగడం వల్ల మలబద్ధకాన్ని పోగొట్టవచ్చు. పేగుల కదలిక నియంత్రించవచ్చు. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. రాత్రంతా నీళ్ళు తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కి గురవుతుంది. అందుకే నిద్రలేవగానే నీళ్ళు తాగాలి. గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు. అజీర్తి సమస్యని దూరం చేస్తుంది. వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని వణుకు సహజంగా తగ్గిపోతుంది. నిద్ర సరిగా పట్టని వారికి వేడి నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి. నిద్రపోయే ముందు గ్లాసు వేడినీళ్లు తాగితే త్వరగా నిద్రపట్టే అవకాశం ఉంది. గోరువెచ్చని నీరు పొట్టలోకి వెళ్లగానే శరీరం దాని ఉష్ణోగ్రతను స్వీకరిస్తుంది.జీవక్రియను ప్రారంభిస్తుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు.