కుళ్లు వాసన వేసే పండు ఇది, అయినా బాగా రేటు చూడటానికి చిన్న పరిమాణంలో ఉన్న పనస పండులా కనిపిస్తుంది ఈ పండు. పేరు ‘దురియన్’. ఈ దురియన్ పండు కత్తిరిస్తే ముక్కు మూసుకుని దూరంగా పారిపోతారు. ఈ దురియన్ పండు కత్తిరిస్తే ముక్కు మూసుకుని దూరంగా పారిపోతారు. అయినా ముక్కు మూసుకుని మరీ తినేస్తారు ఎంతో మంది. ఎందుకంటే దీనిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, బి విటమిన్లు అధికంగా ఉన్నాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని రుచి తీపి,చేదులా కలయికగా ఉంటుంది. ఒక ఆపిల్ పండు ఇచ్చే పోషకాల కన్నా 30 శాతం అధికంగా ఒక దురియన్ పండు ఇస్తుంది.