కౌంట్ తగ్గడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, వృషణ క్యాన్సర్, జీవితకాలం తగ్గే ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధకులు తెలిపారు.

గత 46 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ గణనలు 50 శాతానికి పైగా క్షీణించడాన్ని గమనించారు.

స్పెర్మ్ కౌంట్ అనేది మానవ సంతానోత్పత్తికి మాత్రమే కాదు పురుషుల ఆరోగ్యానికి కూడా సూచిక.

స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేయడంతో పాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

తక్కువ స్పెర్మ్ కౌంట్‌ సమస్యని ‘ఒలిగోస్పెర్మియా’ అంటారు. కౌంట్ తక్కువగా ఉండటం వల్ల సంతానోత్పత్తిలో ఇబ్బందులు వస్తాయి.

అతిగా శుద్ది చేసిన మాంసం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. వీర్య కణాలు చురుగ్గా కదలవు.

వెన్న తీయని పాలల్లో అధికంగా ఈస్ట్రోజెన్ ఉంటుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఆవులకు స్టెరాయిడ్లు ఇస్తారు. వీటి వల్ల వీర్య కణాలు తగ్గిపోతాయి.

ఆరోగ్యకరమైన వాతావరణం ప్రోత్సహించడానికి, పునరుత్పత్తికి ముప్పు కలిగించే అలవాట్లని విస్మరించాలి.

Image Source: Pexels D

ఆహారపు అలవాట్లు మార్చుకుని, ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి కొంతవరకు బయటపడొచ్చు.