19వ శతాబ్దం నుంచే వైద్యులు ఇలా వైట్ కోట్ వేసుకోవటం మొదలైంది. వైద్య వృత్తికి వైట్ కలర్‌కి లింక్ ఉంది.

ఆసుపత్రుల్లో జనం ఎక్కువగా ఉంటే వైద్యుల్ని గుర్తించటం కష్టమవుతుంది. అందుకే వాళ్లు స్పెషల్‌గా వైట్ కోట్ వేసుకుంటారు.

తెలుపు రంగు శుభ్రతకు సంకేతం. వైద్యులు హైజీన్ గా ఉండాలి కాబట్టి అందుకు సంకేతంగా వైట్ కోట్‌ ధరిస్తారు.

రోగుల రక్తంతో పాటు ఇతరత్రా మరకలు అంటితే వైట్‌ కోట్‌పై స్పష్టంగా కనిపిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా మార్చుకోవచ్చు.

డాక్టర్లు వైట్ కోట్ వేసుకుని కనిపిస్తే పేషెంట్స్‌కి చాలా ప్లెజెంట్‌గా ఉంటుందట. మానసికంగా కాస్త రిలాక్స్ అవుతారట.

తమ హోదాను చూపించుకోడానికి, స్పెషల్‌గా కనబడటానికీ డాక్టర్లు వైట్ కోట్ వేసుకుంటారు.

స్టెతస్కోప్, థర్మామీటర్ లాంటి పరికరాలను క్యారీ చేసేందుకు వీలుగా ఈ క్లినికల్ కోట్స్‌కి పాకెట్స్ పెడతారు.

సహ వైద్యులు సులువుగా గుర్తించేందుకు వైద్య సిబ్బంది అంతా ఇలా వైట్‌ కోట్‌లు ధరిస్తారు. (Images Credits: Pixabay)