మొక్కల ఆధారిత ఆహారంతో ఎన్ని లాభాలో మొక్కల నుంచి వచ్చే ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెకు ఆరోగ్యానికి మొక్కల ఆధారిత ఆహారం చాలా అవసరం. వీటిని తినడం వల్ల బరువు పెరగరు. ఊబకాయం వచ్చే అవకాశం తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్సు తగ్గుతుంది. వైరస్‌లతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఈ ఆహారం వల్ల స్ట్రోక్ కూడా రాకుండా అడ్డుకోవచ్చు. మతిమరుపు రాకుండా మొక్కల ఆధారిత ఆహారం అడ్డుకుంటుంది.