మిరియాల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఒక చెంచా మిరియాలలో 13% 'మాంగనీస్', 3% విటమిన్ K ఉంటాయి. ఈ నల్ల మిరియాలలో 'పైపరిన్' అనే మిశ్రమం జీవక్రియను( మెటబాలిజం ) పెంచుతుంది. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అతిగా ఆకలి, అతిగా తినే సమస్య నుంచి బయటపడేందుకు నల్ల మిరియాలతో చేసిన ద్రవాలను తాగితే చాలు. నల్ల మిరియాల్లో 'గ్లైసెమిక్' విలువ తక్కువ. మధుమేహం బాధితులు ఆహారంగా తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంపై కలిగే మంట లేదా వాపును తగిస్తాయి. మిరియాలు ఆహారంలోని కాల్షియమ్,సెలీనియం అనే పోషకాలను గ్రహించే శక్తిని మెరుగుపరుస్తాయి. జలుబు, రొంపతో బాధపడేవారు గ్లాసుడు మిరియాల పాలు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. Images Credit: Pixabay and Pexels