మిగిలిన ఉప్మాతో టేస్టీగా బోండాలు



వండిన ఉప్మా - రెండు కప్పులు
బియ్యప్పిండి - రెండు స్పూన్లు
కారం - అర టీస్పూను
వాము - అర టీస్పూను
బేకింగ్ సొడా - పావు టీస్పూను



శెనగపిండి - ఒక కప్పు
నీళ్లు - తగినన్ని
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయిండానికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు


ఒక గిన్నెలో శెనగపిండి, బేకింగ్ సోడా, బియ్యప్పిండి, వాము, కారం, ఉప్పు వేసుకుని బాగా కలపాలి.



కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుని ఉండలు కట్టకుండా కలపాలి. బోండాలు వేసుకోవడానికి వీలుగా చిక్కగా కలుపుకోవాలి.



కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలపాలి.



మిగిలిన ఉప్మాను ఉండలుగా చుట్టుకోవాలి.



నూనె వేడెక్కాక రుబ్బులో ముంచుకున్న ఉప్మా ఉండల్ని తీసి నూనెలో వేసి వేయించాలి.



ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే మంచి రుచిగా ఉంటాయి.