ఏ సీజన్లోనైనా.. నీళ్లు తాగడం తప్పనిసరి. లేకపోతే శక్తిని కోల్పోతారు. దానివల్ల ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు. మనిషి మెదడులో 80% వరకు నీరు ఉంటుంది. అందుకే తగినన్ని నీళ్లు తాగేవారే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నీటిలోని పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి క్షీణత, మానసిక మగతను నివారిస్తాయి. డీహైడ్రేషన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. మన మెదడుకు అవసరమైనన్ని నీళ్లు తాగకపోతే తలనొప్పి, నీరసం వస్తాయి. మగతగా, చిరాకుగా ఉంటుంది. చలికాలంలో కూడా నీళ్లు తక్కువ తాగితే డీహైడ్రేషన్‌కు గురవ్వుతారు. అది జీవక్రియపై ప్రభావం చూపుతుంది. చర్మం ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉండటం కోసం నీళ్ళు తాగటం చాలా ముఖ్యం. చలికాలంలో నీళ్ళు తాగకపోవడం వల్ల ముఖంపై ముడతలు, పగుళ్ళు, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. వ్యాయామం చేసేప్పుడు శరీరం ఎలక్ట్రోలైట్స్, నీటిని కోల్పోతుంది. వాటిని తిరిగి పొందాలంటే నీరు తాగడం చాలా ముఖ్యం. నీళ్ళు తాగకపోతే నోరు పొడిబారుతుంది. దానివల్ల నోటిలో తక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది. నోటిలో లాలాజలం లేకపోతే సరిగ్గా మాట్లాడలేరు. ఆహారం మింగలేరు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. Images Credit: Pexels and Pixabay