చామంతి పూల టీ లేదా దాల్చిన చెక్క, అల్లం వంటి హెర్బల్ టీలు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. గొంతు నొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియాని చంపుతుంది. రకరకాల పండ్లు, కూరగాయలతో చేసే స్మూతీస్ వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు పొందుతారు. ఓట్ మీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి పొందటం కోసంఅరటి పండు కలుపుకోవచ్చు. లైకోరైస్ గొంతు నొప్పికి అద్భుతమైన నివారణిగా పని చేస్తుంది. లైకోరైస్ రసాన్ని పీల్చినప్పుడు అది గొంతుని సవరిస్తుంది. పసుపు, అల్లం, దాల్చిన చెక్క గొంతు నొప్పికి సహజ నివారణలు. ఇవి కనుక తరచుగా తీసుకుంటే గొంతు నొప్పి, జలుబుని తగ్గిస్తుంది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలని కలిగి ఉంటుంది. గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు, మిరియాలు కలిపిన పాలు తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.