ఉల్లిపాయలు గుండె ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి. ధమనుల్ని రక్షిస్తాయి. అల్లం ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రక్త లిపిడ్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి దూరం చేస్తుంది. బ్రకోలి, క్యాబేజీ వంటి కూరగాయలు తీసుకుంటే ధమనులు బ్లాక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది. నట్స్, విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఓట్స్ బరువు నిర్వహణలో సహాయపడతాయి. ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెకి మేలు చేసే అత్యుత్తమ నూనెల్లో ఆలివ్ ఆయిల్ ఒకటి. ఇందులోని పాలీఫెనాల్ సమ్మేళనాలు రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తాయి. టమోటాల్లో కెరొటీనాయిడ్ పిగ్మెంట్ లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. గుండెని రక్షిస్తుంది. గ్రీన్ బీన్స్ ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచుతాయి. ప్రాణాంతక అథెరోస్క్లేరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది .